గూడూరు చెరువులో మహిళ అనుమానస్పద మృతి…

Clock Of Nellore ( Gudur ) – తిరుపతి జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని వాలయానందపురం వెనుకనున్న చెరువులో మహిళ మృతదేహం ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 35 – 40 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన ఆ మహిళ చనిపోయి మూడు రోజులు అవుతున్నట్లు మృతదేహాన్ని బట్టి చూస్తే తెలుస్తోంది. బ్లూ కలర్ జాకెట్, పసుపు రంగు చీర ధరించి ఉన్న ఆమె ఎవరో ఇంకా నిర్ధారణ కాలేదు. గూడూరు 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి మహిళ ఎవరు అనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఆత్మహత్య చేసుకుందా లేదా ఎవరైనా హత్య చేశారా అనేది తేలాల్సి ఉంది.

Read Previous

ఆత్మకూరు బిజేపి అభ్యర్ధి భరత్ కుమార్ యాదవ్… ఎల్లుండి నామినేషన్

Read Next

రైల్లో నుండి జారి పడి వ్యక్తి మృత్యువాత…

Leave a Reply

Your email address will not be published.