సున్నా వడ్డీ పథకం : ఆమంచర్లలో లబ్ధిదారులకు అందజేసిన గిరిధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore Rural ) – చెప్పిన మాట ప్రకారం డ్వాక్రా రుణాలను మాఫీ చేయడమే కాకుండా సున్నా వడ్డీ పథకం అమలు చేస్తున్న ఘనత ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ మండలం, ఆమంచర్ల గ్రామంలో జరిగిన సున్నా వడ్డీ పథకం కార్యక్రమానికి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యి మహిళలకు సున్నా వడ్డీ పథకం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని మూడేళ్ల లోపే అమలు చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కో – ఆప్షన్ సభ్యులు అల్లాభక్షు, స్థానిక సర్పంచ్ కందుకూరు రమణమ్మ, ఉప సర్పంచ్ వేణుగోపాల్ నాయుడు, ఎంపిటిసి సాధినేని హనుమాయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Read Previous

పైప్ లైన్ నిర్మాణ పనులకు మేయర్ స్రవంతి, వైసీపి నేత కోటంరెడ్డి శ్రీకారం…

Read Next

చిప్పలేరు వాగులో రైతు గల్లంతు : ఊపిరాడక మృత్యువాత

Leave a Reply

Your email address will not be published.