Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ పరిధిలోని అన్ని డివిజన్లలో త్రాగు నీటి సరఫరా ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేసి నీళ్ళను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని వై.సీ.పీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు నగర మేయర్ స్రవంతి ( Nellore Mayor Sravanthi ) పేర్కొన్నారు. 31వ డివిజన్ గాదంశెట్టి రోశయ్య నగర్ లో నూతనముగా ఏర్పాటు చేస్తున్న త్రాగు నీటి పనులకు సోమవారం వారు శంఖుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక 30, 31 డివిజన్లలో రూ.45 లక్షలతో సాయి నగర్, టీచర్స్ కాలనీ, పోలీస్ కాలనీ, కావేరి నగర్, ఏ.వీ.కే. లే అవుట్ ( Nellore City ) తదితర ప్రాంతాలలో సుమారుగా 3 కిలో మీటర్ల పొడవు మేరకు త్రాగు నీటి పైప్ లైన్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. నిర్మాణ పనులలో నాణ్యతతో పాటు, పనులు వేగవంతంగా జరిగేలా స్థానిక నాయకులు అనునిత్యం పర్యవేక్షించాలని వారు సూచించారు. ప్రజలకు స్వచ్చమైన మంచినీరును అందించేందుకు నగరపాలక సంస్థ అధికారులు ప్రతి రోజు తీస్కోవాల్సిన నాణ్యతా ప్రమాణాలను పాటించేలా జాగ్రతలు వహిస్తామని మేయర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 31వ డివిజన్ కార్పొరేటర్ బత్తల మంజుల, వైసీపి ఇంచార్జ్ బత్తల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
