Clock Of Nellore ( Kavali Rural ) – నెల్లూరు జిల్లా, కావలి రూరల్ మండంలోని చిప్పలేరు వాగులో రైతు గల్లంతయ్యాడు. స్థానికంగా నివాసం ఉండే రైతు బండ్ల సురేష్ చిప్పలేరు వాగు అవతల పత్తిని సాగుచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పొలం దగ్గరకు వెళ్లేందుకు చిప్పలేరు వాగు వద్దకు వచ్చాడు. నాలుగు రోజుల క్రితం వరకూ అసని తుఫాను ధాటికి సంభవించిన వర్షాల కారణంగా వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. అయినప్పటికీ వాగు దాటే ప్రయత్నం చేయగా వరదనీటిలో గల్లంతైనాడు. పోలీసులు, స్థానికులు వాగులో గాలించగా మృతి చెంది ఉన్నాడు. మృతుడు సురేష్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.