Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులో ఆకాశవాణి రేడియో కేంద్రాన్ని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు బుధవారం ప్రారంభించారు. వెంకయ్య నాయుడు చొరవతో ఐదేళ్ల క్రితమే నెల్లూరులో ఆకాశవాణి రేడియో కేంద్రం ఏర్పాటైంది. తాజాగా ఈ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించడమే కాకుండా 10 కిలో వాట్స్ సామర్ధ్యం కలిగిన 100 మీటర్ల ఎత్తుగల టవర్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ ఆధునీకరించిన రేడియో కేంద్రంతో పాటూ టవర్ ను కూడా వెంకయ్య నాయుడు ప్రారంభించారు. అనంతరం రేడియో కేంద్రంలోని స్టూడియోను పరిశీలించి వీక్షకులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, నగర మేయర్ స్రవంతి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబ, జాయింట్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్, కార్పొరేషన్ కమిషనర్ జాహ్నవి, ఎస్పీ విజయరావు, ప్రసార భారతి సిఈఓ శశి శేఖర్, ఆలిండియా రేడియో డిజి వేణుధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
