Clock Of Nellore ( Nellore Rural ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జగనన్న మాట – ఇంటింటికి శ్రీధర్ రెడ్డి బాట” కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని “శ్రీధరన్న మాట – గడప గడపకు కార్పొరేటర్ బాట” అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మేయరు స్రవంతి తెలిపారు. ఇందులో భాగంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 12 వ డివిజన్ లోని పెద్ద చెరుకూరు, అల్లీపురం తదితర ప్రాంతాల్లో శ్రీధరన్న మాట – గడప గడపకు కార్పొరేటర్ బాట కార్యక్రమాన్ని బుధవారం మేయరు ప్రారంభించారు. కార్యక్రమంలో ముందుగా అల్లీపురం లోని అభయాంజనేయ స్వామీ దేవాలయము నందు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీధరన్న మాట – గడప గడపకు కార్పొరేటర్ బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సమస్యల పరిష్కారంలో ప్రజా ప్రతినిధులంతా సఫలీకృతం కావాలని భగవంతుడ్ని ప్రార్దిస్తున్నామని మేయరు పేర్కొన్నారు. అనంతరం స్థానిక డివిజన్ లోని ప్రతి ఇంటిని మేయరు సందర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వివిధ స్థానిక సమస్యలను ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. తమ దృష్టి కి వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మేయరు వారికి హామీ ఇచ్చారు. రాజకీయాలలో ప్రజాసేవకు నిజమైన ప్రతిరూపంగా ప్రజల మాటకు గుండె చప్పుడుగా గడప గడపకు యాత్ర చేపట్టిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… రూరల్ నియోజకవర్గం లోని ప్రజలంతా సంఘీభావం తెలపాలని మేయరు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ప్రసన్న కుమార్ రెడ్డి, మనుబోలు రామ్మోహన్ రెడ్డి, బొబ్బా మురళి రెడ్డి, మనుబోలు శ్రీధర్, కోడూరు వెంకట సుబ్బారెడ్డి, రాచూరి రమేష్, బాలచంద్ర, ఇతర వై.సీ.పీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
