నెల్లూరుజిల్లా కోర్టులో చోరీ… కీలక ఆధారాలను దోచుకెళ్లిన దొంగలు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని జిల్లా కోర్టులో చోరీ జరిగింది. దుండగులు కోర్టులోని రికార్డు రూములోని ప్రవేశించి ఓ కేసుకు సంభందించిన ఆధారాలను దోచుకెళ్లారు. వివరాల్లో కెళ్తే… గురువారం తెల్లవారు జామున కోర్టులోని రికార్డు రూములోని ప్రవేశించిన దొంగలు బీరువాను పగులగొట్టి ఓ కేసుకు సంభందించి సీజ్ చేసిన సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, ఇతర డాక్యుమెంట్లను చోరీ చేశారు. ఉదయం కోర్టు సిబ్బంది వచ్చి చూసి చోరీ విషయాన్ని గుర్తించి చిన్నబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నిందితునిగా ఉన్న కేసు ఫైల్స్ చోరీకి గురైనట్లు ప్రచారం జరుగుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Previous

మండుతున్న ఎండలు… ఆగ్నికి ఆహుతవుతున్న వాహనాలు

Read Next

భక్తి శ్రద్ధల మధ్య జరిగిన గుడ్ ఫ్రైడే… శిలువ మోసిన నగర ఎమ్మెల్యే అనీల్

Leave a Reply

Your email address will not be published.