మండుతున్న ఎండలు… ఆగ్నికి ఆహుతవుతున్న వాహనాలు

Clock Of Nellore ( Chillakur ) – మండుతున్న ఎండలకు జనాలు అల్లాడిపోతుండగా… ఆ ఉష్ఠోగ్రతల ధాటికి అనేక ప్రాంతాల్లో వాహనాలు కూడా దగ్ధమవుతున్నాయి. తాజాగా తిరుపతి జిల్లా చిల్లకూరు జాతీయ రహదారిపై వరగలి క్రాస్ రోడ్డులో ఇసుక లోడ్ తో వెళ్తున్న టిప్పర్ దగ్ధమైంది. టిప్పర్ ముందు భాగంలో ఇంజన్ వద్ద వేడి అధికం కావడంతో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో మంటలు వ్యాపించాయి. మంటల ధాటికి టిప్పర్ ముందు భాగం దగ్ధం అయింది. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Read Previous

3 కోట్లతో నర్తకి సెంటర్ అభివృద్ధి : నగర ఎమ్మెల్యే అనీల్ వెల్లడి

Read Next

నెల్లూరుజిల్లా కోర్టులో చోరీ… కీలక ఆధారాలను దోచుకెళ్లిన దొంగలు

Leave a Reply

Your email address will not be published.