Clock Of Nellore ( Nellore ) – నియోజకవర్గంలోని ప్రతీ గడపకూ వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడమే కాకుండా ప్రతీ ఒక్కర్నీ పలకరించాలన్న సంకల్పంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగనన్న మాట – గడప గడపకు కోటంరెడ్డి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈనెల 11వ తేదీనా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. మరో వైపు కోటంరెడ్డి చేపడుతున్న యాత్రకు సంఘీభావంగా 600 మంది యువకులు భారీ రక్తదాన శిభిరాన్ని నిర్వహించారు. నెల్లూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో చేపట్టిన ఈ రక్తదాన శిభిరాన్ని నెల్లూరు ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ అభివృద్ధి కమిటి కో – ఆర్డినేటర్ లక్ష్మీ సునంద ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ( KotamReddy Sridhar Reddy ), నెల్లూరు నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ పాల్గొన్నారు. తాను చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి సంఘీభావంగా యువకులు స్వచ్ఛంధంగా ముందుకొచ్చి రక్తదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని కోటంరెడ్డి అన్నారు. రక్త దానం చేసిన యువకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసీపి నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర రావు, రెడ్ క్రాస్ ఛైర్మైన్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
