Clock Of Nellore ( Nellore ) – మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నెల్లూరుజిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ( Atmakur Constency ) స్థానం నుండి తాను పోటీకు దిగుతున్నట్లు బిజివేముల రవీంద్రారెడ్డి తెలిపారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబం ఎవరు పోటీ చేసినా తాను పోటీ చేసి తీరుతానని ఆయన స్పష్టం చేశారు. మేకపాటి రాజమోహన్ రెడ్డికి స్వయానా మేనల్లుడు అయిన బిజివేముల రవీంద్రారెడ్డి ఆదివారం నెల్లూరులో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మేకపాటి కుటుంబం 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉందని, ఆత్మకూరు, ఉదయగిరి అభివృద్ధిని వారు గాలికొదిలేశారని ఆరోపించారు. కనీసం ప్రజలకు చిన్న సాయం కూడా చేయలేదన్నారు. అందుకే తాను పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. బిజేపి తరపున కానీ లేదా స్వతంత్ర అభ్యర్ధిగా గానీ పోటీలో ఉంటానని రవీంద్రారెడ్డి తెలియజేశారు.