Clock Of Nellore ( Nellore ) – తరచుగా తల తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే న్యూరాలజీ వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ సీనియర్ న్యూరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ పి. దీక్షంతి నారాయణ్ తెలిపారు. తల తిరగడాన్ని వైద్య బాషలో వర్టిగో అని పిలుస్తారని చెప్పారు. దీనిపై ఆమె ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఆ వ్యాధి లక్షణాలు, ఇతర వివరాలను మీడియా ద్వారా తెలియజేశారు. తల తిరగడం వ్యాధి వికారం, వాంతులు, చెమటలు పట్టడం, శరీరంలో దడ తదితర లక్షణాలతో మొదలవుతుందని తెలియజేశారు. ఈ లక్షణాలు ఉన్న వారు తమ రోజూ వారీ కార్యకలాపాలు యధావిధిగా నిర్వహించలేరని, తీవ్రమైన ఇబ్బందికి గురౌతారని కొన్ని సమయాల్లో అది ప్రాణాంతకం కూడా కావచ్చని ఆమె హెచ్చరించారు.
తల తిరగడం అనేది వ్యాధి కాదని, మెదడులో ఏర్పడ్డ సమస్య యొక్క లక్షణమని డాక్టర్ దీక్షంతి నారాయణ్ తెలియజేశారు. మెదడుకు సంభందించిన ఏదైనా వ్యాధి కావచ్చునన్నారు. ముఖ్యంగా చిన్న మెదడు, చెవి లోపల సమస్యలకు తల తిరగడం మఖ్య కారణంగా ఉండవచ్చునన్నారు. బ్రెయిన్ స్ట్రోక్, ఇన్ఫెక్షన్లు, తల గాయాలు, కొన్ని రకాల మందుల వాడకం, వెర్టిజినస్ మైగ్రేన్, మెనియర్స్ డిసీజ్, ఒటోలిత్స్ మొదలైన అంతర్గత సమస్యలు… తల తిరగడం ( వెర్టిగో ) సమస్యకు కారణాలుగా కూడా ఉంటాయన్నారు. బాధితుల లక్షణాలను బట్టి పరీక్షలు నిర్వహించాలని, అప్పుడప్పుడూ CT లేదా MRI స్కాన్ ద్వారా వెర్టిగోను నిర్ధారించాలని డాక్టర్ దీక్షింతి నారాయణ్ తెలియజేశారు. పరోక్సిస్మల్ వెర్టిగో అనేది ప్రమాదకరం కాదని, ఇతర వర్టిగో సమస్యలు ప్రాణాపాయంగా మారతాయన్నారు.

ప్రమాదకరమైన వెర్టిగో లక్షణాలు ఇలా ఉంటాయి…
– వెర్టిగో కారణంగా తీవ్రమైన తలనొప్పితో పాటూ వాంతులు రావడం.
– చూపు మందగించి ఒక వస్తువు రెండుగా కనిపించడం.
– శరీరం బలహీనంగా ఉండటం లేదా తిమ్మిరిగా ఉండటం.
– సరిగ్గా నడవలేక పోవడం, మాట తేడా రావడం, వినికిడి లోపం తలెత్తడం.
– స్రృహ కోల్పోవడం లేదా అపస్మారక స్థితిలోకి వెళ్లడం.
– జ్వరం లేదా తల గాయం ద్వారా కూడా వర్టిగో సమస్య వస్తుంది.
పైన పేర్కొన్న లక్షణాలు ఉంటే వెంటనే న్యూరాలజిస్టును సంప్రదించి ప్రమాదకరమైన వెర్టిగో సమస్య నుండి బయటపడాలని డాక్టర్ దీక్షింతి నారాయణ్ తెలియజేశారు. వెర్టిగో సమస్య చాలా ప్రభావం చూపుతుందని, నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ లో వెర్టిగోకు అత్యాధునికి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వెర్టిగో నివారణలో ఫిజియోథెరపీ, వ్యాయామం కూడా కీలక పాత్ర పోషిస్తాయని వెర్టిగో లక్షణాలు ఉన్నవారు మెడికవర్ హాస్పిటల్ ను సంప్రదించాలని కోరారు.