ముఖ్యమంత్రిని కలిసిన ఎంపి ఆదాల… పలు అంశాలపై చర్చ

Clock Of Nellore ( Amaravathi ) – నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరుకు రింగ్ రోడ్డును, మైపాడు – కోడూరు బీచ్ రోడ్డును ఏర్పాటు చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డిని కోరారు. శుక్రవారం అమరావతిలోని అసెంబ్లీ లాబీలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని కూడా అందజేశారు. ఆత్మకూరు – ఉదయగిరి రోడ్డులను కూడా అభివృద్ధి చేయాలని అడిగారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లా రాజకీయాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా ఉదయగిరి అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి పనిచేయాలని ఎంపీ ఆదాలను, సీఎం కోరారు. ఆ ప్రాంత ప్రజల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. దానికి ఎంపీ ఆదాల కూడా తన చేయూతను అందిస్తానని హామీ ఇచ్చారు.

Read Previous

డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసిన ఎంపి ఆదాల, ఎమ్మెల్యే ఆనం…

Read Next

ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి దంపతులు…

One Comment

  • ఉదయగిరి ఆత్మకూరు రోడ్డును అభివృద్ధి చేయమని చెప్పడం చాలా ఆనందదాయకం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఉదయగిరి ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు త్రాగునీరు త్రాగునీరు విద్యా వైద్యము రవాణా సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో లేవు సరైన ఉపాధి అవకాశాలు లేక ప్రజలు వలస వెళ్ళి ఉదయగిరి ప్రాంతంలో కేవలం మహిళలు వృద్ధులు పిల్లలు మాత్రమే ఉన్నారు దయచేసి ఉదయగిరి చరిత్ర మార్చండి ఉదయగిరి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా మీరు నిలిచి పోవాలంటే ఉదయగిరి అభివృద్ధి పరచండి

Leave a Reply

Your email address will not be published.