Clock Of Nellore ( Atmakuru ) – కాఫీ తాగండి… కప్పు తినండి… వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. టీ తాగిన కప్పునే తృప్తిగా ఆరగించే వెరైటీ టీ స్టాల్ ను ఏర్పాటు చేశారు నెల్లూరుజిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన సతీష్ కుమార్. స్థానిక పినాకిని బ్యాంక్ ఎదురుగా సతీష్ కుమార్ నూతనంగా అఖిల్ టీ స్టాల్ ను ఏర్పాటు చేశారు. అందరిలాగానే టీ స్టాల్ పెడితే పెద్దగా చెప్పుకునేది ఏముందని భావించి వెరైటీ స్టార్ ను ఏర్పాటు చేశారు. అతని టీ స్టాల్ లో టీ పోసి ఇచ్చిన కప్పును టీ తో పాటు ఆరగించవచ్చు. ఓ పక్క టీ, కాఫీ తాగుతూనే బిస్కెట్ లాగా టీ కప్పును తింటూ ఉంటే ఎంతో బాగుందని ఈ టీ స్టాల్ కి జనం ఎగబడుతున్నారు.. వెరైటీ గా కొత్తగా పెట్టిన ఈ టీ స్టాల్ వద్ద తినే కప్పులో టీ తాగుతూ జనం భారీగా ఉండడంతో పట్టణ ప్రజలు ఈ టీ స్టాల్ గురించి వింతగా చర్చించుకుంటున్నారు. కోన్ ఐస్ క్రీమ్ లో వాడే కోన్ తోనే ఈ కప్పులు తయారవడమే దీని ప్రత్యేకత.
