మేకపాటి రాజమోహన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి అనీల్…

Clock Of Nellore ( Nellore ) – మేకపాటి గౌతమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డిని బుధవారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ పరామర్శించారు. ఇటీవల గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. నెల్లూరులోని వారి నివాసానికి వెళ్లిన మంత్రి రాజమోహన్ రెడ్డితో కాసేపు మాట్లాడారు. తన సంతాపాన్ని తెలియజేశారు. గౌతమ్ రెడ్డి లేని లోటు వ్యక్తిగతంగా తనకూ తీరనిదని అన్నారు. మంత్రితో పాటూ నుడా ఛైర్మైన్ ముక్కాల ద్వారకానాథ్, డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, ఖలీల్ అహ్మద్ కూడా ఉన్నారు.

Read Previous

జిల్లా గ్రంథాలయంకు నూతన పుస్తకాలు… ఎంపిక చేసిన ఛైర్ పర్సన్ దొంతు శారద

Read Next

సచివాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి అనీల్ …

Leave a Reply

Your email address will not be published.