ప్రజల సందర్శనార్ధం… రేపు నెల్లూరులో గౌతమ్ రెడ్డి పార్ధీవ దేహం

Clock Of Nellore ( Nellore ) – గుండె పోటుతో కన్నుమూసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్ధీవ దేహాన్ని ప్రజల సందర్శనార్ధం నెల్లూరు నగరంలోని వారి నివాసంలో ఉంచనున్నారు. హైదరాబాద్ నుండి ఆర్మీ హెలికాప్టర్ లో మంగళవారం ఉదయం గౌతమ్ రెడ్డి పార్ధీవ దేహాన్ని నెల్లూరుకు తీసుకురానున్నారు. ఉదయం 10 గంటల నుండి మరుసటి రోజైన బుధవారం ఉదయం 10 గంటల వరకూ నెల్లూరు నగరంలోని డైకస్ రోడ్డులో ఉన్న వారి నివాసంలో ఉంచనున్నారు. అనంతరం బుధవారం ఉదయం రోడ్డు మార్గం ద్వారా స్వగ్రామమైన మర్రిపాడు మండలం, బ్రాహ్మణపల్లికి పార్ధీవ దేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో సహా అందరు మంత్రులు, నెల్లూరుజిల్లాతో పాటూ వివిధ జిల్లాల ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. మరో వైపు మంగళవారం గౌతమ్ రెడ్డి పార్ధీవ దేహాన్ని నెల్లూరులోని వారి నివాసంలో ఉంచనున్న నేపద్యంలో ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ తదితర అధికారులు ఏర్పాట్లు చేశారు.

Read Previous

స్వగ్రామంలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు ఏర్పాట్లు… పర్యవేక్షిస్తున్న కలెక్టర్

Read Next

మంత్రి గౌతమ్ రెడ్డి మృతికి సంతాపం… కలెక్టరేట్ లో జాతీయ జెండా అవనతం

Leave a Reply

Your email address will not be published.