Clock Of Nellore ( Nellore ) – మాగుంట శరత్ చంద్రారెడ్డి – మాగుంట సస్మితరెడ్డి దంపతుల వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నెల్లూరులో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు ఎం.ఎస్.ఆర్ సేవా సమితి సభ్యులు. సమితి అధ్యక్షులు సాయిబాబు ఆధ్వర్యంలో గాంధీనగర్ లో ఉన్న శ్రీ సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం పేదలకు అల్పాహార ప్యాకెట్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. మాగుంట దంపతులు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిషాద్, యశ్వంత్, రూపక్, సాయిరామ్ పాల్గొన్నారు.

