టిడిపి నుండి వైసిపిలోకి చేరికలు… ఆహ్వానించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ మండలం, కొత్త వెల్లంటి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కైపు ఆదిత్య రెడ్డి, కైపు వెంకట రమణారెడ్డితో వారి అనుచరులు శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తనను నమ్మి, తన వెంట నడుస్తున్న కార్యరక్తల రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు బలంగా, సంతోషంగా ఉంటేనే ఏ పార్టీకైనా మనుగడ ఉంటుందని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్త వెల్లంటి సర్పంచ్ తురిమెర్ల లక్ష్మమ్మ, ఎంపిటిసి సభ్యురాలు దేవసేనమ్మ తదితరులు పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరులో నూతనంగా శశి లక్ష్మణ్ గ్యాస్ట్రో అండ్ లివర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

Read Next

ఆలయ అభివృద్ధికి కృషి చేయండి… ధర్మకర్తలను కోరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.