ఆలయ అభివృద్ధికి కృషి చేయండి… ధర్మకర్తలను కోరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మ వారి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నూతనంగా నియమితులైన ధర్మకర్తలు కృషి చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు. నూతనంగా నియమితులైన దేవస్థాన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొని వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలుగా నియమితులైన వారు అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టపడి చేసి, ఆథ్యాత్మిక భావన కలిగిన వారికి ధర్మకర్తలుగా అవకాశం కల్పించాలని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని, దాతల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. అనంతరం నూతన ధర్మకర్తలను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Read Previous

టిడిపి నుండి వైసిపిలోకి చేరికలు… ఆహ్వానించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి

Read Next

వికాస్ ఆరోగ్య దీపిక… ప్రారంభించిన మంత్రి అనీల్ కుమార్ యాదవ్

Leave a Reply

Your email address will not be published.