Clock Of Nellore ( Balayapalli ) – వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని బాలాయపల్లి మండలం, అలిమిలి గ్రామ పంచాయితీలోని కనుమరాయకొండలో ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం జీర్ణోద్ధరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఇందులో భాగంగా ఇవాళ పునః ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. పునః ప్రతిష్ట అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం రామ నారాయణ రెడ్డి మాట్లాడుతూ చారిత్రాత్మకమైన ఈ ఆలయాన్ని పునర్నించడం శుభపరిణామమని, ఆ కార్యక్రమంలో తాను పాల్గొనడం అదృష్ఠంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆనం తెలియజేశారు.
