నెల్లూరులో నైట్ బీట్ మరింత పటిష్ఠం… “చాయ్ విత్ బీట్స్” ప్రారంభించిన ఎస్పీ

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలో రాత్రి పూట పోలీసు గస్తీని మరింత పటిష్ఠం చేశారు ఎస్పీ విజయరావు. ఇటీవల జిల్లాలోని పలు చోట్ల అర్ధరాత్రి నేరాలు విపరీతంగా పెరిగాయి. నెల్లూరు నగరంలో అయితే హత్యలు కూడా జరుగుతున్నాయి. ఓ హత్యకు సంభందించి ఎస్పీ రాత్రి గస్తీ సిబ్బందిపై చర్యలు కూడా తీసుకున్నారు. ఈ నేపద్యంలో రాత్రి గస్తీపై ప్రత్యేక దృష్ఠి సారించారు ఎస్పీ విజయరావు. రాత్రి గస్తీ నిర్వహించే పోలీసుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు “చాయ్ విత్ బీట్స్” అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో భాగంగా గురువారం అర్ధరాత్రి, శుక్రవారం తెల్లవారు జామున పలు చోట్ల రాత్రి గస్తీని తనిఖీ చేశారు. నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్, మాగుంట లే అవుట్ లోని డి – మార్ట్ వద్ద విధి నిర్వహణలో ఉన్న బీట్ సిబ్బందిని అర్ధరాత్రి వేళలో కలిసి వారితో కలిసి చాయ్ తాగుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. రాత్రి వేళల్లో జరిగే గ్రేవ్ కేసులపై ఉక్కుపాదం మోపుతూ, అక్రమ రణావా, చట్ట వ్యతిరేక, అసాంఘీక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అర్ధరాత్రి వేళ ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు. ఆ సమయంలో ప్రమాణానికి గల కారణాలను అడిగి తెలుసుకుని వారి వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. అనుమానిత వ్యక్తులు వస్తే వారి వేలి ముద్రలు సేకరించాలని ఎస్పీ ఆదేశించారు. రాత్రి వేళల్లో ప్రయాణించే మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలకు ఏమైనా రక్షణ సహాయం అవసరమైతే చేయాలని చెప్పారు. ఈ – బీట్ యాప్ పనితీరుని, బీట్ బుక్ ను తనిఖీ చేశారు.

Read Previous

బైక్ ను ఢీ కొట్టిన లారీ… వ్యక్తి మృత్యువాత

Read Next

లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ… పాల్గొన్న మాజీ మంత్రి ఆనం

Leave a Reply

Your email address will not be published.