అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ తథ్యం : స్పష్టం చేసిన మెట్టుకూరు

Clock Of Nellore ( Atmakur ) – 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం తథ్యమని స్పష్టం చేశారు కేంద్ర సహకార బ్యాంకు మాజీ ఛైర్మైన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి. ఇటీవల ఆత్మకూరులో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరయిన ఆయన వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. మృదు స్వభావి అయిన ధనుంజయరెడ్డి… ఆనం అనుచరునిగా కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశం పార్టీ, ప్రస్తుతం వైసీపిలో కొనసాగుతున్నారు. సొంత ట్రస్టు ద్వారా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో మూడు రోజుల క్రితం ఆయన పర్యటించిన సందర్భంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన చేశారు. అనంతసాగరం మండలం, ఆత్మకూరు పట్టణంలో దేవాలయాల నిర్మాణం కోసం ఆయన సొంత నిధులు ఇచ్చే క్రమంలో ఆత్మకూరు పట్టణం జేఆర్ పేట ప్రాంతంలోని వినాయక దేవాలయ మండపానికి తన సొంత నిధులు అందచేసేందుకు వచ్చి ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ మాటలు స్పష్టం చేశారు.. జే ఆర్ పేట లోని వినాయక దేవాలయ మండపానికి అక్కడి నిర్వాహకులకు 2,50,000 చెక్కును అందజేసిన అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను పుట్టినిల్లుగా ఆత్మకురు నియోజవర్గం, అత్తవారిల్లుగా వెంకటగిరి నియోజకవర్గంలో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అభిమానులు తన పోటీపై స్పష్టత కోరుతున్నారని, వచ్చే ఎన్నికల్లో తాను బరిలో ఉంటున్నట్లు ప్రకటించారు. కానీ ఎక్కడ నుండి, ఏ పార్టీ నుండి పోటీ చేస్తారో అనే విషయం వెల్లడించలేదు.. ధనుంజయ రెడ్డి సమావేశానికి ఆత్మకురు మున్సిపాలిటీ పరిధిలోని 8 మంది కౌన్సిలర్లు హాజరు కావడం విశేషం.

Read Previous

మెడికవర్ లో వెయ్యి దాటిన క్యాన్సర్ PET CT స్కాన్స్…

Read Next

నెల్లూరులో స్వచ్ఛతా లీగ్ ర్యాలీ – పరిసరాలను శుభ్రం చేసిన మేయర్, కమిషనర్

Leave a Reply

Your email address will not be published.