హైవే లింగ్ రోడ్డును పరిశీలించిన గిరిధర్ రెడ్డి – మరమ్మత్తులకు ఆదేశం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు అపోలో హాస్పిటల్ జంక్షన్ నుండి జాతీయ రహదారిని కలిపే లింక్ రోడ్డును గురువారం వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. భారీ వాహనాల రాకపోకల నేపద్యంలో రోడ్డు గుంతల మయంగా మారి వాహనదారులు ఇబ్బందులు పడుతుండటంతో ఈ రోడ్డును పరిశీలించారు. త్వరగా మరమ్మత్తులు పని చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దీనిపై గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రహదారి కార్పొరేషన్ పరిధిలో ఉన్నందున త్వరలో కార్పొరేషన్ నిధులతో మరమ్మత్తులు చేస్తామన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషితో ఇప్పటికే రూరల్ లో పెద్ద ఎత్తున రోడ్లను పునర్ నిర్మించామని, త్వరలోనే ఈ రోడ్డుకు కూడా మరమ్మత్తులు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 17, 18 డివిజన్ల కార్పొరేటర్లు పేనేటి సుధాకర్, అశోక్ నాయుడు పాల్గొన్నారు.

Read Previous

ఆపదలో ఉన్న వ్యక్తికి మిత్రుల సహకారం : వైద్యానికి లక్ష అందజేత

Read Next

నెల్లూరు జిల్లాలో విషాదం : ఉరేసుకుని తల్లీ, బిడ్డల బలవన్మరణం

Leave a Reply

Your email address will not be published.