Clock Of Nellore ( Venkatagiri ) – మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డికి మహిళా ప్రజా ప్రతినిధులు రాఖీ కట్టి తమ సోదర భావాన్ని చాటుకున్నారు. వెంకటగిరి పర్యటనలో ఉన్న ఆయనకు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని వెంకటగిరి మున్సిపల్ ఛైర్ పర్సన్ నక్కా భానుప్రియ, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్ పర్సన్ దొంతు శారద, పలువురు మహిళా కౌన్సిలర్లు రాఖీ కట్టి, ఆనం నుండి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.
