నెల్లూరు కేంద్ర కారాగారంలో రాఖీ పౌర్ణమి వేడుకలు – ఖైదీలకు రాఖీ కట్టిన అరుణ

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని సెంట్రల్ జైల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. దిశా ప్రొటెక్షన్ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి నిడిగుంట అరుణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆమె ఖైదీలతో సమావేశం నిర్వహించి రాఖీ పర్వదిన విశేషాన్ని తెలియజేశారు. సమాజం బాగుండాలంటే ప్రతీ ఖైదీ క్షమా గుణం కలిగి ఉండాలని సూచించారు. అనంతరం ఖైదీలకు స్వీట్లు పంచి, అందరికీ రాఖీ కట్టి వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. జైలు అధికారులకు కూడా రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ నెల్లూరుజిల్లా అధ్యక్షురాలు భీమతాటి సారిక, జైలు సూపరింటెండెంట్ రాజేశ్వరరావు, అదనపు సూపరింటెండెంట్ మహేష్ బాబు, డిప్యూటీ సూపరింటెండెంట్ కాంతరాజ్, ఫౌండేషన్ సభ్యులు వాదనాల సరిత, అరవ ప్రమీల, పనబాక జయప్రద తదితరులు పాల్గొన్నారు.

Read Previous

ఆనంకు రాఖీ కట్టిన మహిళా ప్రజా ప్రతినిధులు

Read Next

మూలాపేట శివాలయంలో అన్న ప్రసాద మండపం – శంఖుస్థాపన చేసిన అనీల్

Leave a Reply

Your email address will not be published.