ఎంపి విజయసాయిపై చర్యలు తీసుకోండి – నెల్లూరులో పోలీసులకు ఫిర్యాదు

Clock Of Nellore ( Nellore ) – దివంగత నందమూరి తారకరామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి మరణంపై సోషల్ మీడియాలో దుష్ ప్రచారం చేస్తున్న ఎంపి విజయసాయి రెడ్డి, వైసీపి నేత దేవంద్ర రెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. దీనిపై నెల్లూరులో తెలుగుయువత అధ్యక్షులు కాకర్ల తిరుమల నాయుడు, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు షేక్ అమ్రుల్లా, తెలుగు మహిళ అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మి చిన్నబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నందమూరి కుటుంబంలో జరిగిన ఆ విషాదంపై వారు సోషల్ మీడియా వేదికగా దుష్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Read Previous

80వ రోజుకు చేరిన పవనన్న ప్రజాబాట – ప్రభుత్వంపై కేతంరెడ్డి ధ్వజం

Read Next

ప్రియుడిపై మోజు… భర్తపై వేటు ? – నెల్లూరుజిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి

Leave a Reply

Your email address will not be published.