Clock Of Nellore ( Nellore ) – హింధూ దేవాలయాలకు చెందిన నిధులు వైసీపి ప్రభుత్వం నవ రత్నాలకు మళ్లించుకుంటుందని బిజేపి నేతలు మండిపడ్డారు. నెల్లూరు మూలాపేటలోని మూలస్థానేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన 30 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్లను ప్రభుత్వం మళ్లించుకుందని ఆరోపించారు. ఈ చర్యలను నిరసిస్తూ బిజేపి నేత మిడతల రమేష్ ఆలయం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మూలస్థానేశ్వర దేవస్థానంతో పాటూ నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం, జొన్నవాడ కామాక్షితాయి ఆలయం, నరసింహకొండలోని వేదగిరి నరసింహస్వామి ఆలయం నిధులను కూడా ప్రభుత్వం నవరత్నాల కోసం మళ్లించిందని అన్నారు. ఆలయాలకు చెందిన డిపాజిట్లను ప్రభుత్వం తమ ఖాతాలకు మళ్లించుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ తక్షణం ఆలయాలకు చెందిన డిపాజిట్లను తిరిగి వెనక్కు వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పూనమల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.