Clock Of Nellore ( Atmakur ) – ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్ లో మహిళా చైతన్యం స్పష్టంగా కనిపించింది. నియోజకవర్గంలోని 279 పోలింగ్ కేంద్రాల్లో మహిళా ఓటర్లే అత్యధికంగా దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి మహిళా ఓటర్లు అధికంగా తరలివచ్చారు. తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏ పోలింగ్ బూత్ లో చూసినా మహిళా ఓటర్లే అధికంగా కనిపించారు. యువ ఓటర్లు కూడా అధికంగా ఉన్నారు.

