ఓటు హక్కు వినియోగించుకున్న మేకపాటి విక్రమ్ రెడ్డి

Clock Of Nellore ( Marripadu ) – ఆత్మకూరు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అధికార వైసీపి అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి ఉదయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వగ్రామమైన మర్రిపాడు మండలం, బ్రాహ్మణపల్లిలో విక్రమ్ రెడ్డి ఓటు వేశారు. అనంతరం విక్రమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆత్మకూరులో తన గెలుపు ఖాయమని అన్నారు. తన సోదరుడు మేకపాటి గౌతమ్ రెడ్డి ఆశయాల సాధనకు కృషి చేస్తానని, ఆయన చేయాలనున్న అన్నీ పనులను పూర్తి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గాన్ని అన్నీ విధాలా అభివృద్ధి చేస్తానన్నారు.

Read Previous

ప్రశాంతంగా కొనసాగుతున్న ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్

Read Next

ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ : బారులు తీరిన మహిళా ఓటర్లు

Leave a Reply

Your email address will not be published.