పురస్కారాలతో వాలంటీర్లకు మరింత ప్రోత్సాహం – మేయర్ స్రవంతి

Clock Of Nellore ( Nellore Rural ) – సంక్షేమ పాలన కోసం ముఖ్యమంత్రి ఆలోచనలతో రూపొందించిన సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులందరికీ సంక్షేమ పతకాలను అందించడంలో వారధులుగా నిలుస్తున్న వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ అందిస్తున్న పురస్కారాలతో వారికి మరింత ప్రోత్సాహం అందుతోందని నెల్లూరు నగర మేయర్ స్రవంతి పేర్కొన్నారు. స్థానిక 2వ డివిజన్ లోని గుడి పల్లిపాడు పరిధిలో విధులు నిర్వహిస్తున వాలంటీర్లకు ఉగాది ప్రోత్సాహక పురస్కారాలను స్థానిక సచివాలయంలో శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సచివాలయ పరిధిలోని ప్రజలందరితో మమేకమై అనునిత్యం వారి సమస్యలను ప్రభుత్య దృష్టికి తీసుకు వచ్చేలా వాలంటీర్లు కృషి చేయాలని కోరారు. ఉగాది పురస్కారాలకు ఎంపికైన గ్రామ, వార్డు వాలంటీర్లు అందరికీ మేయర్ శుభాకాంక్షలు తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలో కాని, ప్రపంచంలో కాని ఎక్కడా లేని విధంగా పరిపాలనలో స్వర్ణ యుగం తెచ్చేలా 2019 ఆగస్టు 15న వాలంటీర్లను సచివాలయ వ్యవస్థలో భాగంగా చేసారని తెలిపారు. మృత్యువుతో ప్రపంచ వ్యాప్తంగా భీభత్సానికి గురిచేసిన కరోనా సమయంలో సైతం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావలసిన సేవలు, అందాల్సిన సంక్షేమ పథకాలను ధైర్యంగా ప్రజలకు వాలంటీర్లు అందజేశారని కొనియాడారు. వాలంటీర్ల విశిష్ట సేవలను మెచ్చిన ముఖ్యమంత్రి సేవా మిత్రా, సేవ రత్న, సేవా వజ్ర పేర్లతో ఉగాది పుర్కారాలను ప్రత్యేకంగా నిర్వహించడం శుభ పరిణామం అని వారు ప్రశంసించారు. అవార్డులు అందుకున్న వాళ్లకి, అందుకోని వాళ్ళకి కొద్దిపాటి తేడా మాత్రమే ఉన్నదని, అవార్డులు రానివాళ్లు మరింత కృషి చేసి రాబోయే సంవత్సరంలో పురస్కారపు గౌరవాన్ని అందుకోవాలని మేయర్ సూచించారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ పడిగినేటి రామ్మోహన్, 1వ డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజు, వై.సీ.పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read Previous

వైసీపిని నమ్ముకుంటే అధోగతే… పాదయాత్రలో కేతంరెడ్డి వెల్లడి

Read Next

గృహ పథకం పనులు వేగవంతం చేయండి – అధికారులకు మేయర్, కోటంరెడ్డి ఆదేశం

Leave a Reply

Your email address will not be published.