Clock Of Nellore ( Nellore ) – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ప్రజలు నమ్ముకుంటే అధోగతి పాలవ్వాల్సిందేనని నెల్లూరు సిటీ జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఎద్దేవా చేశారు. అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తున్న నెల్లూరు నగరంలో ఏం అభివృద్ది పనులు చేశారని ప్రశ్నించారు. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఆయన గురువారం 3వ డివిజన్ లోని మైపాడు రోడ్డు, ప్రశాంతి నగర్ లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిపక్ష పార్టీగా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపి ప్రభుత్వం కనీసం రోడ్లు కూడా వేయలేకపోతుందని, చివరకు ప్రజలే పన్నులు కడుతూ కూడా వారి సొంత నగదును భరించి రోడ్లు వేసుకుంటున్నారని పేర్కొన్నారు. నగరాభివృద్ధి కోసం జనసేన పార్టీని ఆశీర్వదించాలని, పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలు నడుంబిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చింతంరెడ్డి శిరీషా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
