నెల్లూరులో గోవా మద్యం… 412 బాటిళ్ల సీజ్… ఇద్దరు అరెస్ట్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులో ఇతర రాష్ట్రాల మద్యం ఏదో ఒక చోట వెలుగుచూస్తూనే ఉంది. ఇటీవల మైపాడు బీచ్ వద్ద షిప్ నుండి దిగుమతి చేస్తున్న గోవా మద్యాన్ని భారీగా సీజ్ చేసిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు… తాజాగా మరో సారి గోవా మద్యాన్ని గుర్తించి సీజ్ చేశారు. నెల్లూరు స్టోన్ హౌస్ పేటకు చెందిన యరగాల వినోద్ కుమార్, నవాబుపేటకు చెందిన మీసాల గంగరాజు అనే ఇద్దరు గోవాలో తక్కువ ధరకు మద్యాన్ని కొనుగోలు చేసి అక్రమ పద్దతుల్లో నెల్లూరుకు తీసుకొచ్చి అధిక ధరలకు వివిధ ప్రాంతాల్లో విక్రయించేవారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం నెల్లూరు సమీపంలోని పొట్టేపాళెం వద్ద సెబ్ పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతుండగా స్విఫ్ట్ డిజైర్ కారుపై అనుమానం వచ్చి తనిఖీ చేయగా అందులో 412 గోవా మద్యం బాటిళ్లు లభ్యమైనాయి. దీంతో కారులో ఉన్న ఇద్దర్నీ అదుపులోకి తీసుకుని విచారించగా గోవాలో కొనుగోలు చేసినట్లు అంగీకరించారు. గురువారం నెల్లూరులోని సెబ్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ శ్రీలక్ష్మి విలేకరుల సమావేశం నిర్వహించి నిందితులిద్దర్నీ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 412 మద్యం బాటిళ్లు, కారు, 4 సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు వెల్లడించారు.

Read Previous

విస్త్రృతంగా రోడ్ల నిర్మాణ పనులు : పర్యవేక్షించిన మేయర్, కోటంరెడ్డి

Read Next

కళ్లముందు అభివృద్ధి కనిపిస్తుంటే… చౌకబారు విమర్శలా… మాజీ మంత్రి అనీల్ ధ్వజం

Leave a Reply

Your email address will not be published.