Clock Of Nellore ( Nellore Rural ) – నెల్లూరు 12, 2 డివిజన్లలోని అల్లిపురం పాత డంపింగ్ యార్డు నుంచి నరుకూరు వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నామని, అత్యంత నాణ్యతతో పనులు జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వై.సీ.పీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర మేయర్ స్రవంతి పేర్కొన్నారు. ఆయా డివిజన్లలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను గురువారం వారు పరిశీలించి అధికారులు, నిర్మాణ దారులకు వివిధ సూచనలు చేసారు. రోడ్డు నిర్మాణ సమయంలో రవాణాకు అంతరాయం లేకుండా తాత్కాలిక మార్గాలను సిద్దం చేయాలని, నిర్మాణ పనులు జరుగుతున్నట్టు వివిధ సూచికలను అన్ని ప్రధాన మార్గాలలో ఏర్పాటు చేయాలని తెలిపారు. సుమారుగా 11 కోట్ల రూపాయల అంచనాలతో మొత్తము 6.4 కి.మీ.లు మేరకు రోడ్డు నిర్మాణం జరుగుతుందని వారు తెలిపారు. వీలైనంత త్వరగా రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వై.సీ.పీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, 1 డివిజన్ కార్పొరేటర్ జాన నాగరాజు, 2 వ డివిజన్ కార్పొరేటర్ పడిగినేటి రామ్మోహన్ యాదవ్, 1, 2, 12 వ డివిజన్ల నాయకులు, వై.సీ.పీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
