Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలో ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా కళ్లముందు అభవృద్ధి పనులు జరుగుతుంటే కొందరు టిడిపి నేతలు పనిగట్టుకుని అతస్య ప్రచారం చేస్తున్నారని, ప్రజలను భయాందోళనలను గురి చేస్తున్నారని మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. గురువారం ఆయన నెల్లూరు 8వ డివిజన్ పరిధిలోని ఉస్మాన్ సాహెబ్ పేట, సిఆర్పీ డొంక, రేబాలవారి వీధి ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వివిధ అభివృద్ధి పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. అనంతరం అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సర్వేపల్లి కాలువ ఆధునీకరణ పనులు ఎవరికీ ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయని, వర్షాల కారణంగా నిలిచిపోయిన పనులను త్వరలోనే తిరిగి ప్రారంభిస్తామన్నారు. కొందరు టిడిపి నేతలు ఆయా ప్రాంతాలకు వెళ్లి ఇళ్లు కూల్చివేస్తారని ప్రజలకు లేని పోని భయాలను సృష్ఠిస్తున్నారని మండిపడ్డారు. ఒక్క ఇల్లు కూడా పోకుండా పనులు జరిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో కార్పొరేటర్లు కామాక్షిదేవి, కిన్నెర ప్రేమ్ కుమార్, వైసీపి నేతలు రఘు, శేషు గౌడ్ పాల్గొన్నారు.
