ఆర్. కృష్ణయ్యకు రాజ్యసభ కేటాయించండి : లేళ్ల అప్పిరెడ్డిని కోరిన అబ్ధుల్ కలాం

Clock Of Nellore ( Vijayawada ) – బీసి సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్. కృష్ణయ్యకు ఏపి తరపున రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలని ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్ లేళ్ల అప్పిరెడ్డిని కోరారు బీసీ విద్యార్ధి సంఘం జాతీయ అధ్యక్షులు షేక్ అబ్ధుల్ కలాం. శుక్రవారం విజయవాడలోని వైసీపి కార్యాలయంలో అప్పిరెడ్డిని… అబ్ధుల్ కలాం కలిశారు. గత ఎన్నికల్లో ఆర్. కృష్ణయ్య వైసీపికి మద్దతు తెలపడంతో పాటూ బీసీ సామాజిక వర్గాన్ని మొత్తం పార్టీ వైపు నడిపించారని గుర్తు చేశారు. వైసీపికి బలమైన ఓటు బ్యాంకుగా బీసీ సామాజిక వర్గం నిలిచిందని… దానికి కారణమైన ఆర్. కృష్ణయ్యకు బీసీ కోటాలో రాజ్యసభ సీటు కేటాయించాలని అప్పిరెడ్డికి విజ్ఞప్తి చేశారు.

Read Previous

మెడికవర్ లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం : సేవలను కొనియాడిన డాక్టర్ గణేష్

Read Next

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనంను కలిసిన తిరుపతి డి.ఆర్.డి.ఏ పిడి

Leave a Reply

Your email address will not be published.