Clock Of Nellore ( Nellore Rural ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి “జగనన్న మాట – గడప గడపకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాట” పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుంది. 22వ రోజైన సోమవారం కూడా ఆయన సౌత్ మోపూరులో పర్యటిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీస్తున్నారు. పాదయాత్రగా గ్రామంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మార్గం మధ్యలో కూడా ప్రజలను పలకరిస్తూ వారి బాగోగులను అడిగి తెలుసుకుంటున్నారు. చిన్న చిన్న కాలనీల్లో అందరితో ఒకే దగ్గర మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.
