Clock Of Nellore ( Nellore ) – పర్యావరణ పరిరక్షణకు, సామాజిక సేవకు అంకితమై నిరంతర కృషి చేస్తున్న వనం ఫౌండేషన్ సేవలు సమాజ ప్రగతికి ఎంతగానో దోహదపడుతాయని నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి ప్రశంసించారు. నెల్లూరు పొదలకూరు రోడ్డు, వాటర్ ట్యాంక్ సమీపంలో వనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రంను సోమవారం మేయర్ ప్రారంభించారు. అనంతరం మేయర్ ప్రసంగిస్తూ వనం ఫౌండేషన్ చేపట్టే ఏ కార్యక్రమానికైనా కార్పోరేషన్ ద్వారా సహకరిస్తానని పేర్కొన్నారు. ముందుగా మేయర్ తో పాటు ముఖ్య అతిథులు మొక్కలు నాటారు. మేయర్, స్థానిక కార్పోరేటర్ కరణం మంజులను, ప్రపంచ మానవ హక్కుల సంఘం జాతీయ అధ్యక్షులు యం.సుబ్బారెడ్డిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వనం ఫౌండేషన్ చైర్మన్ వనం శ్రీరాములు, కార్యదర్శి వనం రమాదేవి, కోశాధికారి గిరీష్, EC మెంబర్ మానికల విజయలక్ష్మి, YSRCP నాయకులు కరణం హజరత్ నాయుడు, పొదుపు సంఘం సమాఖ్య అధ్యక్షురాలు యస్.మాధవి, ప్రవీణ్, శ్రీనివాసులురెడ్డి, శ్రీనివాసులు నాయుడు, అల్లాబక్షు, జక్కాల చంద్రశేఖర్, నూర్, దగ్గుపాటి రాధాకృష్ణ, బొడ్డు వెంకటేశ్వర్లు, దొరస్వామి తదితరులు పాల్గొన్నారు.
