నాడు – నేడు పనులకు శ్రీకారం… పత్తివారి స్కూల్లో ఎమ్మెల్యే అనీల్ శంఖుస్థాపన

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నవాబుపేటలోని పత్తివారి స్కూల్లో నాడు – నేడు పథకం ద్వారా 1.56 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ శ్రీకారం చుట్టారు. దీనికి సంభందించి స్కూల్ ఆవరణంలో శంఖుస్థాపన చేశారు. అనంతరం తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నాడు – నేడు పథకం ద్వారా నెల్లూరులోని అన్నీ ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను మార్చడమే ఈ పథకం లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కామాక్షిదేవి, దామవరపు రాజశేఖర్, కిన్నెర మాల్యాద్రి, ప్రేమ్ కుమార్, ఓబిలి రవిచంద్ర, వైసీపి నేతలు రఘు, తుంగా ఇందూధర్ రెడ్డి, దనూజ రెడ్డి పాల్గొన్నారు.

Read Previous

‘స్పందన’ ను సద్వినియోగం చేసుకోండి – కమిషనర్ జాహ్నవి

Read Next

సౌత్ మోపూరులో కొనసాగుతున్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రజా పలకరింపు

Leave a Reply

Your email address will not be published.