నెల్లూరులో ఘనంగా మేడే వేడుకలు – నగరంలో భారీ ప్రదర్శన

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలో మే డే వేడుకలు ఘనంగా జరిగాయి. వాడ వాడలా కార్మికులు మేడే ను పురస్కరించుకుని ఎర్ర జెండాలను ఎగుర వేశారు. వామపక్ష పార్టీ నేతలు ఎక్కడికక్కడ ప్రదర్శనలు చేపట్టారు. నెల్లూరు నగరంలో ఆదివారం సాయంత్రం సిపిఎం, సిపిఐ పార్టీలు వాటి అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు, అసంఘటిత కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అతి పొడవైన ఎర్రజెండాతో ఆత్మకూరు బస్టాండ్ నుండి పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహం, నర్తకి సెంటర్, ఏసి సెంటర్, ట్రంకు రోడ్డు, విఆర్సీ సెంటర్, మద్రాస్ బస్టాండ్ వరకూ ఈ ప్రదర్శన సాగింది. పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరయ్యారు. ఇరు పార్టీల నేతలు ఈ సందర్భంగా మేడే విశిష్ఠతమై ప్రసంగించారు.

Read Previous

పెట్రోల్ బంకుల్లో మోసాలు… తేడాలపై నిలదీసిన వాహన చోదకులు

Read Next

నెల్లూరు జిల్లాలో ప్రమాదం : ఇద్దరు మృత్యువాత

Leave a Reply

Your email address will not be published.