పెట్రోల్ బంకుల్లో మోసాలు… తేడాలపై నిలదీసిన వాహన చోదకులు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు అయ్యప్పగుడి ఫ్లై ఓవర్ వంతెన పక్కనున్న ఓ పెట్రోల్ బంకు వద్ద వాహన చోదకులు సిబ్బందిని నిలదీశారు. పెట్రోల్ విక్రయాల్లో మోసాలు జరుగుతున్నాయని ప్రశ్నించారు. వందల రూపాయలకు పెట్రోల్ పట్టిస్తే ఇట్టే అయిపోతుందని అనుమానం వ్యక్తం చేసిన కొందరు వాహన చోదకులు లీటర్ బాటిళ్లు తీసుకొచ్చి పెట్రోల్ పట్టించారు. 150 రూపాయలు ఫీడ్ చేయగా లీటర్ బాటిల్ పూర్తిగా కూడా నిండకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ విక్రయాల్లో భారీగా తేడాలున్నాయని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ వీడియోను తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా అనేక మంది దాన్ని రీ షేర్ చేస్తూ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆయితే ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించింది అనేది వారు చెప్పలేదు.

Read Previous

వెంకటగిరి మున్సిపల్ ఛైర్ పర్సన్ కు ఆనం ఆశీర్వాదం…

Read Next

నెల్లూరులో ఘనంగా మేడే వేడుకలు – నగరంలో భారీ ప్రదర్శన

Leave a Reply

Your email address will not be published.