జాతీయ రహదారిపై కారు దగ్ధం : ప్రయాణీకులు సురక్షితం

Clock Of Nellore ( Duttaluru ) – నెల్లూరుజిల్లా దుత్తలూరు మండలంలో జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. నలుగురు ప్రయాణీకులు ఆ కారులో వస్తున్న సమయంలో సరిగ్గా దుత్తలూరు మండలం, నందిపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఒక్కసారిగా ఇంజన్ లో మంటలు చెలరేగాయి. కారులోని వ్యక్తులు దాన్ని గమనించి కారును రోడ్డుపైన నిలిపివేసి బయటకు వచ్చేశారు. నిముషాల వ్యవధిలో కారు మొత్తం దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇంజన్ లో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు.

Read Previous

ప్రభుత్వం చెబితే చేస్తుంది : సున్నా వడ్డీ చెక్కులు అందజేసిన మంత్రి కాకాణి

Read Next

చెన్నైకి ఆర్టీసీ బస్సులో గంజాయి తరలింపు – 24 కేజీల స్వాధీనం

Leave a Reply

Your email address will not be published.