Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులో ఆదివారం సాయంత్రం జరిగిన హనుమాన్ శోభాయాత్రపై బీర్ బాటిల్ విసిరిన వ్యక్తిని గుర్తించి తక్షణం అరెస్ట్ చేయాలని బిజేపి నేత మిడతల రమేష్ డిమాండ్ చేశారు. దీనిపై ఆయన ఇవాళ జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబును కలిసి వినతి పత్రం అందజేశారు. హనుమంతుని విగ్రహంతో హింధువులు శోభాయాత్ర చేస్తుండగా మద్రాస్ బస్టాండ్ వద్ద ఓ వ్యక్తి హనుమంతుని విగ్రహంపై బీర్ బాటిల్ విసిరి రెడ్ క్రాస్ వైపు పరుగుతీశాడని చెప్పారు. తాము అక్కడే ఉన్న పోలీసులకు చెప్పినా ఆ వ్యక్తిని పట్టుకోలేదన్నారు. నెల్లూరులో మత సామరస్యాన్ని కాపాడాలని కోరారు. అంతే కాకుండా నగరంలోని రెండు వస్త్ర దుకాణాల యజమానులు ఆర్.ఎస్.ఎస్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, వారి దుకాణాల్లో వస్త్రాలు కొనుగోలు చేయవద్దంటూ కొంత మంది సోషన్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని దానిపై కూడా విచారణ జరిపి బాధ్యులుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.