తనిఖీల జాప్యంపై కలెక్టర్ అసహనం – నీరు చెట్టు పనులపై సమీక్ష

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు జిల్లాలో పెండింగ్ లో ఉన్న మూడు వేలకు పైగా నీరు చెట్టు పనుల తనిఖీలను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు  ( IAS Chakradhar Babu ) అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో ” నీరు- చెట్టు కార్యక్రమం పనుల తనిఖీల పురోగతిపై ” సమావేశం నిర్వహించి శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 3308 నీరు చెట్టు పనులను తనిఖీ చేయుటకు 43 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అందులో 501 పనులు కోర్టు కేసులకు సంబందించి ఉన్నాయని, వాటిలో ఇప్పటి వరకు 206 పనుల తనిఖీలు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇంకా 295 కోర్టు కేసుల పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే మూడుసార్లు సమీక్షించడం జరిగిందని ఆరు నెలల కాలం గడిచిపోయిన ప్పటికీ ఇంకనూ పెండింగ్ లో ఉండటం సరైంది కాదని స్పష్టం చేస్తూ ఇకనైనా తొలి ప్రాధాన్యత నిచ్చి వ్యక్తిగతంగా బాధ్యత తీసుకొని వచ్చే వారంలోగా రిట్ పిటిషన్ కోర్టు కేసులు అన్నీ కూడా కచ్చితంగా ముగించేలాగా చొరవ చూపాలన్నారు.

మిగిలిన మూడు వేలకు పైగా ఉన్నా నీరు చెట్టు పనుల తనిఖీలు మే మాసంలోగా తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు. మే నెల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కటి కూడా పెండింగ్ ఉండరాదని ఆదేశించారు. ఇకపై ప్రతి రోజూ ప్రత్యేక శ్రద్ధ వహించి సమీక్ష చేస్తూ బృందాలకు అవసరమైన మార్గనిర్దేశంతో అనుకున్న పురోగతిని సాధించాలన్నారు. వర్షాకాలం రాకముందే జిల్లాలో ఇతర అభివృద్ధి పనులన్నీ నాణ్యత లో ఏ మాత్రం రాజీపడకుండా మంచి పురోగతి సాధించి మెరుగైన ఫలితాలతో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని సూచించారు. ఈ సమావేశంలో జలవనరులు, పంచాయతీరాజ్, రహదారులు భవనాలు, ఆర్డబ్ల్యూఎస్, ప్రజారోగ్య శాఖల ఎస్. ఇ. లు కృష్ణ మోహన్, సుబ్రహ్మణ్యం, రామాంజనేయులు, రంగ ప్రసాద్, జాని, పలువురు ఈ ఈ లు, డిఈ ఈ లు పాల్గొన్నారు.

Read Previous

ఎమ్మెల్యే కోటంరెడ్డి పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్… సోమవారం నుండి యథాతధం

Read Next

వేసవి సెలవుల్లో నాడు – నేడు పనులు పూర్తి కావాలి : అధికారులకు కలెక్టర్ ఆదేశం

Leave a Reply

Your email address will not be published.