భక్తి శ్రద్ధల మధ్య జరిగిన గుడ్ ఫ్రైడే… శిలువ మోసిన నగర ఎమ్మెల్యే అనీల్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలో గుడ్ ఫ్రైడే ( Good Friday ) వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు క్రైస్తవులు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ వివిధ చర్చీలలో ప్రార్ధనలు నిర్వహించి క్రీస్తును ఆరాధించారు. నెల్లూరు కపాడిపాళెంలోని సెయింట్ జోసెఫ్ చర్చ్ లో జరిగిన ప్రార్ధనల్లో నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం క్రీస్తు శిలువను మోశారు. ఏసు క్రీస్తు ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎమ్మెల్యే అనీల్ కాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, స్థానిక కార్పొరేటర్ కాయల సాహిత్య తదితరులు పాల్గొన్నారు.

Read Previous

నెల్లూరుజిల్లా కోర్టులో చోరీ… కీలక ఆధారాలను దోచుకెళ్లిన దొంగలు

Read Next

నాడు – నేడు పనులపై అధికారులతో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమీక్ష…

Leave a Reply

Your email address will not be published.