వాలంటీర్లకు వందనం… పురస్కారాలు అందించిన కోటంరెడ్డి, మేయర్ స్రవంతి

Clock Of Nellore ( Nellore ) – సంక్షేమ పాలన కోసం ముఖ్యమంత్రి ఆలోచనలతో రూపొందించిన సచివాలయ వ్యవస్థలో వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకమని, ఉగాది పురస్కారాలతో వారికి మరింత ప్రోత్సాహం లభించిందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు నగర మేయర్ స్రవంతి  ( Nellore Mayor Sravanthi )పేర్కొన్నారు. నగరంలోని 25వ డివిజన్ బుజబుజ నెల్లూరులో ఒక ప్రయివేటు పాఠశాలలో, 26 వ డివిజన్ టీచర్స్ కాలనీ సచివాలయంలో, 27 వ డివిజన్ రిత్విక్ ఎంక్లేవ్ సచివాలయంలో, 28 వ డివిజన్ న్యూ మిలిటరీ కాలనీ మున్సిపల్ పాఠశాలలో, 29 వ డివిజన్ గాంధీ నగర్ సచివాలయంలో, 31 వ డివిజన్ ఎల్.బి.ఎస్ నగర్ సచివాలయంలో వాలంటీర్లకు ఉగాది ప్రోత్సాహక పురస్కారాలను శుక్రవారం అందజేశారు. కార్యక్రమాలకు మేయర్ స్రవంతి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ, వార్డు వాలంటీర్ల ఉగాది పురస్కారాలకు ఎంపికైన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పరిపాలనలో స్వర్ణయుగం తెచ్చేలా 2019 ఆగస్టు 15న వాలంటీర్లను సచివాలయ వ్యవస్థలో భాగం చేసారని తెలిపారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా సమయంలో సైతం ప్రజలకు కావలసిన సేవలు, ప్రజలకు అందాల్సిన పథకాలను ప్రభుత్వం నుంచి చేరవేసే రథసారథులుగా వలంటీర్లు నిలిచారని కొనియాడారు. వలంటీర్ల విశిష్ట సేవలను మెచ్చిన ముఖ్యమంత్రి సేవా మిత్రా, సేవ రత్న, సేవా వజ్ర పేర్లతో ఉగాది ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించడం శుభ పరిణామం అని వారు ప్రశంసించారు. అవార్డులు అందుకున్న వాళ్లకి, అందుకోని వాళ్ళకి కొద్దిపాటి తేడా మాత్రమే ఉన్నదని, అవార్డులు రానివాళ్లు మరింత కృషి చేసి రాబోయే సంవత్సరంలో గౌరవాన్ని అందుకోవాలని మేయర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బద్దెపూడి నరసింహ గిరి, బూడిద సుప్రజ, భీమినేని మురహరి, చక్కా అహల్య, షేక్ సత్తార్, కూకటి ప్రసాద్ రావు, బత్తల మంజుల, వైసిపి డివిజన్ ఇంఛార్జ్ లు చక్కా సాయి సునీల్, బత్తల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read Previous

జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో ఎమ్మెల్యే రోజా…

Read Next

సన్మాన కార్యక్రమానికి వాలంటీర్ల డుమ్మా – ఎమ్మెల్యే ఆనం ఆగ్రహం

Leave a Reply

Your email address will not be published.