రంగడి సేవలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు … అర్చకులకు సన్మానం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని తల్పగిరి రంగనాథస్వామి ఆలయాన్ని ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ( Chakradhar Babu ) దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి చేరుకున్న కలెక్టర్ కు ధర్మకర్తల మండలి అధ్యక్షులు ఇలపాక శివకుమార్ ఆచారి, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ స్వామి వారిని దర్శించుకున్నారు. తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు ముగ్గులు అర్చకులను కలెక్టర్ సన్మానించి వారికి రూ.10,116/- లు సంభావన, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఆలయ ఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Read Previous

నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన నెల్లూరు ఎస్పీ విజయరావు…

Read Next

ప్రజా సమస్యల పరిష్కార వేదికలు… వైసీపి కార్యాలయాలు… కోటంరెడ్డి వెల్లడి

Leave a Reply

Your email address will not be published.