Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా ఎస్పీ విజయరావు శుక్రవారం నెల వారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్రా కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఈ సమీక్షకు జిల్లాలోని పోలీసు అధికారులంతా పాల్గొన్నారు. గడచిన నెల రోజుల వ్యవధిలో జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వారీగా కేసుల వివరాలు, పెండింగ్ కేసుల పరిష్కారం తదితర అంశాలపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. గత నెల సమీక్షకు ఈ సమీక్షకు మధ్యలో కేసులను తగ్గించటంలో ఇతర అంశాలలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందిస్తూ వారికి మెమెంటోలు, ప్రశంసా పత్రాలను అందించారు. కేసులను ఎప్పటి కప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం జిల్లాలో పనిచేస్తున్న 741 మంది హోం గార్డులకు స్మార్ట్ ఐడి కార్డులను ఎస్పీ విజయరావు అందజేశారు.
