Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న అన్నీ వైసీపి కార్యాలయాలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలుగా పనిచేస్తాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ( Nellore Rural Mla Kotamreddy )అన్నారు. నెల్లూరు 29వ డివిజన్ పరిధిలోని గాంధీనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వైసీపి కార్యాలయాన్ని వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. పార్టీ కార్యాలయాల్లో స్థానిక నాయకులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, కార్యాలయాలను ప్రజా సమస్యల వేదికలుగా మార్చాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి సూచించారు. స్థానిక ప్రజలు ఈ కార్యాలయాన్ని సద్వినియోగం చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సత్తార్, డివిజన్ ఇంఛార్జ్ కొండా సాయి కుమార్ రెడ్డి, ఏపిఐడిసి డైరెక్టర్ తిప్పిరెడ్డి మమతారెడ్డి పాల్గొన్నారు.
