Clock Of Nellore ( Nellore ) – విద్యుత్ ఛార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వామపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. నెల్లూరులోని విద్యుత్ భవన్ ఎదుట సిపిఎం పార్టీ నేత మాదాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నేతలు ఆందోళన నిర్వహించారు. ఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణం ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు.