రాపూరు కేంద్రంగా పోలీస్ సర్కిల్ ను ఏర్పాటు చేయండి… ఎస్పీని కోరిన ఆనం

Clock Of Nellore ( Nellore ) – జిల్లాల పునర్విభజనలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు కేంద్రంగా పోలీస్ సర్కిల్ ను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి… జిల్లా ఎస్పీ విజయరావును కోరారు. గురువారం నెల్లూరులోని ( Nellore Police ) జిల్లా పోలీసు కార్యాలయంలో ఆనం రామ నారాయణరెడ్డి… ఎస్పీని కలిశారు. రాపూరు కేంద్రంగా నూతన పోలీసు సర్కిల్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతానని ఎస్పీ తెలియజేశారు.

Read Previous

హరిత నెల్లూరు సాధనే లక్ష్యం… మొక్కలు నాటిన మేయర్ స్రవంతి

Read Next

విద్యుత్ ఛార్జీలపై భగ్గుమన్న వామపక్షాలు… విద్యుత్ భవన్ ఎదుట ధర్నా

Leave a Reply

Your email address will not be published.