Clock Of Nellore ( Marripadu ) – గుర్తు తెలియని వాహనం ఢీ కొని నెల్లూరుజిల్లాలో చిరుత పులి మృత్యువాత పడింది. మర్రిపాడు మండలం, తిమ్మానాయుడుపేట అటవీ ప్రాంత ఘాట్ రోడ్డులో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి 7 గంటల ప్రాంతంలో చిరుత పులి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం దాన్ని ఢీ కొట్టింది. 8 గంటల ప్రాంతంలో అదే రోడ్డులో స్థానికులు వెళుతూ చిరుత పులి రోడ్డుపై చనిపోయి ఉండటాన్ని గుర్తించారు. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకుని పులి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.